Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Sardaar can beat Baahubali


    ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేలా చేస్తున్న ఆ టాలీవుడ్ మూవీకి... షూటింగ్ స్టేజ్ లో ఉన్న క్రేజీ హీరో సినిమా పోటీ అవుతుందని ప్రచారం సాగుతోంది. అయితే... షూటింగ్ దశలో ఉన్న స్టార్ హీరో సినిమాకు అంత రేంజ్ వస్తుందని ఊహించడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. గబ్బర్ సింగ్ సీక్వెల్ గా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సిన పవన్ కళ్యాణ్ సర్దార్ మూవీ... కొద్ది రోజుల క్రితం నుంచే షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను చాలా నెలలుగా వాయిదా వేస్తూ వచ్చిన పవర్ స్టార్.. ఈ మధ్య రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక మొన్నీమధ్యే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఫస్ట్ లుక్ ఎఫెక్టో లేక పవన్ క్రేజో తెలియదు కానీ... ఈ సినిమాకు భారీ బిజినెస్ ఆఫర్లు రావడం మొదలయ్యాయట. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ సినిమా కోసం భారీ మొత్తంలో అడ్వాన్స్ లు చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్లకు ముందుకు వస్తున్నారట. ఓవరాల్ ఈ సినిమా బిజినెస్ 85 కోట్ల వరకు జరగొచ్చని ఫిలింనగర్ లోని కొందరు చర్చించుకోవడం మొదలుపెట్టారట. అయితే సర్దార్ సినిమా బిజినెస్ గురించి వస్తున్న ఈ ప్రచారాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బాహుబలి వంటి సినిమానే తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్ల బిజినెస్ చేసిందని... అలాంటిది సర్దార్ సినిమాకు 85 కోట్ల బిజినెస్ జరుగుతుందని కొందరు చెబుతున్నారు. సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి ఇలాంటి ప్రచారం జరగడం సహజమే అయినా... మరీ ఈ స్థాయిలో రూమర్స్ ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని సినీ జనం అవాక్కవుతున్నారు. బిజినెస్ పరంగా పవర్ స్టామినా రేంజ్ లోనే సర్దార్ బిజినెస్ ఉండొచ్చని... బాహుబలి రేంజ్ లో సర్దార్ సినిమా బిజినెస్ ను ఎక్స్ పెక్ట్ చేయలేమని ఓపెన్ గానే చర్చించుకుంటున్నారు. ఏదేమైనా...బిజినెస్ పరంగా బాహుబలితో సర్దార్ పోటీపడటం చాలా కష్టమని చెప్పకతప్పదేమో.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Sardaar can beat Baahubali Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top