వాస్తవానికి ఇంత బడ్జెట్ రవితేజపై వర్కౌట్ అవ్వదు అనే విషయం తెలిసిన కూడా తప్పని పరిస్థితుల్లో కళ్యాణ్ రామ్ ఈ సాహసం చేసినట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌తో ఇంత భారీ బడ్జెట్‌ను పెట్టించినందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా ఫీల్ అవుతున్నాడట. అందుకు ఆయన క్షమాపణలు సైతం చెప్పినట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఇంత మొత్తంలో వసూళ్లు అవ్వడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా ద్వారా సురేందర్‌రెడ్డి కళ్యాణ్‌రామ్‌ను ముంచితే తర్వాత ఫైనాన్షియర్లకు ఇవ్వాల్సిన మొత్తానికి తారక్ హామీగా ఉండి సినిమా రిలీజ్‌కు సాయం చేశాడని టాక్.
పటాస్ హిట్ తో మంచి జోష్‌లో ఉన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోవడం ఎంతైనా బాధాకరం. ఓ సినిమా బడ్జెట్ అదుపు చేయకుండా నచ్చినట్లు షూట్ చేసుకుపోవడం డైరక్టర్ చేసిన తప్పు. ఇప్పట్లో ఇది దిద్దుబాటుకు నోచుకోదు. గతంలోనూ గుణశేఖర్ ఈ తరహా తప్పిదాలెన్నింటినో చేసి నిర్మాతలను పుట్టిముంచాడు. తీరా! రుద్రమతో తాను నిర్మాత అయ్యేటప్పటికి కనీసం టేబుల్ ప్రాఫిట్ సైతం రాబట్టలేక ఆ..మధ్య ఆస్పత్రి పాలయ్యాడు. నరసింహుడు విషయంలోనూ అంతే! ఆ రోజు సురేశ్ ప్రొడక్షన్స్ ఆదుకోకుంటే చెంగల వెంకట్రావ్‌కు ఆత్మహత్యే శరణ్యం. అఫ్‌కోర్స్ అప్పటికే అతడు హుస్సేన్ సాగర్‌లో దూకి చనిపోయేందుకు ప్రయత్నించాడు కూడా.. ఏదేమైనా బడ్జెట్ అదుపులో ఉంచని డైరక్టర్లకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుందేమో!
0 comments:
Post a Comment