Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    New Rules For Vehicle Registration


    •     కొత్త వాహనదారులకు సరికొత్త కష్టాలు
    •      పేర్లు ఒకే రకంగా ఉంటే రెండో వాహనంగా పరిగణింపు
    •      2 నుంచి 4 శాతం అధికంగా పన్ను వసూలు
    •     లబోదిబోమంటున్న వాహనదారులు

    మీరు మొద టి సారిగా కొత్త వాహనం కొంటున్నారా... అయితే ఒ క్కసారి ఆగండి. రవాణా శాఖ రికార్డుల్లో అప్పటికే మీ పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు ఒకే రకంగా ఉం టే మీ వాహనం రెండో వాహనం కింద లెక్కగడతా రు. దానికి అదనంగా 2 నుంచి 4 శాతం వరకు జీవి త పన్ను చెల్లించాల్సిందే. లేదంటే అప్పటికే రవాణా శాఖ రికార్డుల్లో ఉన్న వివరాలు మీవి కానట్లుగా రు జువులు తెచ్చి ఇవ్వాల్సిందే. ఇందుకోసం అవసరమైతే మీ పేర్లతో ఉన్న వారి చిరునామాల కోసం రాష్ట్రమం తా తిరిగాల్సి రావచ్చు. రవాణా శాఖ అధికారుల నిబంధనలు ఇప్పుడు కొత్త వాహనదారులకు సరికొత్త క ష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో కొత్త వాహనం కొన్నామన్న ఆనందం లేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు. గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆర్టీఏ కార్యాలయాల్లో ఇలాంటి సంఘనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు ఈ విషయాలతో రవాణా శాఖ అధికారులు కొత్త వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. తాము మొట్టమొదటిసారిగా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తున్నానని ఎంత మొత్తుకున్నా పట్టించుకోవడం లేదు.

    కమిషనర్‌ ఆదేశాలంతే...
    మోటారు వాహనాల చట్టం ప్రకారం రెండో వాహనం కొనుగోలు చేసినప్పుడు వాహనాన్ని బట్టి పన్ను 2 నుంచి 4 శాతం ఎక్కువగా చెల్లించాలి. కానీ ఈ విషయాన్ని ఆర్టీఏ అధికారులు, సిబ్బంది పట్టించుకోకుండా రవాణా శాఖకు రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ గుర్తించారు. దీంతో కొత్త వాహనం రిజిస్ర్టేషన్‌ చేసే ముందు ఆ పేరుతో ఏవైనా వాహనాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసిన తర్వాతే కొత్త వాహనాలకు రిజిస్ర్టేషన్లు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఖచ్చితంగా కొత్త వాహనం రిజిస్ర్టేషన్‌కు వచ్చిన వ్యక్తి పేరుతో రవాణా శాఖ రికార్డులను ఆన్‌లైన్‌లో వెతికి తీస్తున్నారు. ఒకే పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు వస్తే మాత్రం రుజువులు అందజేయాలన్న ఆదేశాలున్నాయి. ఇదే నిబంధన ఇప్పుడు కొత్త వాహనదారులకు సరికొత్త కష్టాలను తెచ్చి పెడుతోంది. అయితే ఈ విషయంలో ఆర్టీఏలో ఏజెంట్ల ద్వారా వెళ్లినా పని కావడం లేదు. రుజువులు తెచ్చుకోండి వాహనం రిజిస్ర్టేషన్‌ చేస్తామంటూ రవాణా శాఖ అధికారులు ఒక్క మాటలో చెప్పేస్తున్నారు.

    ఇదీ ఒక కొత్త వాహనదారుడి గోస...
    బోరబండకు చెందిన అజయ్‌కుమార్‌ బీటెక్‌ పూ ర్తి చేశాడు. ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణుడవడంతో అత ని తండ్రి కొత్తగా అజయ్‌కుమార్‌కు నచ్చిన పల్సర్‌ బైక్‌ కొనిచ్చాడు. దీంతో ఎంతో ఆనందంతో ఉప్పొంగి పోయి వాహనం రిజిస్ర్టేషన్‌ కోసం ఖైరతాబాద్‌లో ని ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లాడు. అక్కడి రికార్డుల్లో అజ య్‌కుమార్‌.బి, తండ్రి పేరు యాదగిరి పేరుతో వరంగల్‌ జిల్లా (ఏపీ 36 ఎఫ్‌ 9019)లో ఒక వాహ నం. కరీంనగర్‌ జిల్లాలో (ఏపీ15 ఏఈ 4058) మ రో వాహనం రిజిస్ర్టేషన్‌ చేసుకున్నట్లు వివరాలు న్నాయి. కాబట్టి నీ వాహనం రెండో వాహనంగా ప రిగణిస్తున్నాం. ఇందుకు జీవిత పన్ను రూపేణా రూ.3వేల వరకు అదనంగా చెల్లించాలని చెప్పారు. లేదంటే వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఉన్న పేర్లు మీవి కానట్లు రుజువు చూపి రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఇంతకు మించి ఈ విషయంలో మేమేం చేయలేమని కరాఖండిగా చెప్పేశారు. దీం తో చేసేదేమీ లేక అజయ్‌కుమార్‌ పరుగు పరుగు న వరంగల్‌కు వెళ్లి అక్కడి చిరునామా, వివరాల ను తెలుసుకున్నాడు. అక్కడ లభించిన ఫోన్‌ నంబర్‌తో ఫోన్‌ చేస్తే తాను మహారాష్ట్రలో ఉంటున్నానని, 2000 సంవత్సరంలో కొనుగోలు చేసిన బైక్‌ను ఎప్పుడో అమ్మేశానని చెప్పేశాడు. ఇప్పుడు దీనికి నావద్ద ఎలాంటి ఆధారాలు లేవని, నేనేమీ ఇవ్వలేనని చెప్పేశాడు. అంతదూరం వెళ్లినా లాభం లేకపోవడంతో ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో జేటీసీని సంప్రదించినా తానేమీ చేయలేనని, రవాణా శాఖ కమిషనర్‌ పెట్టిన నిబంధనలను పాటించాల్సిందేనని చెప్పడంతో అజయ్‌కుమార్‌ది దిక్కుతోచని పరిస్థితి. ఇదీ ఒక కొత్త వాహనదారుని సరికొత్త కష్టం. ఇలాంటి వారు గ్రేటర్‌ పరిధిలో నిత్యం పదుల సంఖ్యలోనే ఉంటారు. వారందరిదీ ఇదే పరిస్థితి. ఉన్నతాధికారుల ఆదేశాలు, కింది స్థాయి అధికారులు, సిబ్బంది తీరుతో కొత్త వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: New Rules For Vehicle Registration Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top