రోబో తర్వాత సరైన సినిమా లేని సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టు చెన్నై టాక్. అందుకే రెగ్యులర్ డైరెక్టర్స్‌ను పక్కనపెట్టి యంగ్ డైరెక్టర్ రంజిత్‌తో న్యూ మూవీ కమిట్ అయ్యాడు రజనీ. తనకు కెరీర్‌లో అచ్చొచ్చిన మాఫియా ఫిల్మ్స్ బిల్లా, బాషా, దళపతి స్టైల్‌లోనే ఈ మూవీ ఉంటుందని లేటెస్ట్ న్యూస్.
గతంలో పేరుమోసిన చెన్నై డాన్ కబలెశ్వరన్ రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కే ఈ మూవీకి " కబలి " అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సోమవారం నుండి సెట్స్ కు వెళ్తున్న ఈ మూవీ కోసం ఫోటో షూట్ ట్రైనింగ్ క్యాంప్‌లో కూడా సిన్సియర్ గా పాల్గొన్న రజనీ కమిట్ మెంట్ కు కోలీవుడ్ శాల్యూట్ చేస్తున్నట్టు వినిపిస్తోంది. తెలుగులో " కాళి " టైటిల్‌తో డబ్ అవుతుందని అంటున్న ఈ మూవీలో లెజెండ్ ఫేం రాధిక ఆప్టే రజనీ జంటగా నటిస్తోంది.
0 comments:
Post a Comment