నిన్న నాగార్జున.. నేడు ఎస్వీయూ
ర్యాగింగ్‌పై ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినా, ఎన్ని చర్యలు చేపట్టినా కంటిన్యూ అవుతూనే వుంది. ఇప్పటికే దీని బారినపడి నాగార్జున వర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన మరవముందే మరొకటి వెలుగుచూసింది. తాజాగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇందుకు వేదికైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
శేషాద్రి బ్లాక్‌లో ఎంసీఏ సీనియర్ విద్యార్థులు, జూనియర్లను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మెస్‌లో జూనియర్లను అడ్డుకున్న సీనియర్లు, టీషర్ట్‌లు విప్పి రావాలని హుకుం జారీ చేశారని సమాచారం. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ ఘటనపై ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. దీనికి సంబంధించి వీసీ, రిజిస్ర్టార్‌ను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ర్యాగింగ్ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ర్టార్ చెప్పుకొచ్చారు. ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
0 comments:
Post a Comment