ఇక నుంచి పాస్ పోర్టు రెన్యువల్ చేయించుకోవడం సులభతరం కానుంది. పాస్ పోర్టు రెన్యువల్ చేయించుకోవడానికి పోలీస్ వెరిఫికేషన్తో పని లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇప్పటి వరకు పాస్ పోర్టు రెన్యువల్ చేయించుకోవాలంటే పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ వెరిఫికేషన్ కోసం కనీసం 15 నుంచి 20 రోజుల సమయం వృథా అయ్యేది.
‘పాస్ పోర్టు రెన్యువల్కు పోలీస్ వెరిఫికేషన్ ఇక అవసరం లేదు. పోలీసులు పూర్తిగా విచారించి నివేదిక ఇచ్చిన తర్వాతే పాస్ పోర్టు వస్తుంది. కాబట్టి మళ్లీ వెరిఫికేషన్ అవసరం లేద’ని విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి వీకే సింగ్ తెలిపారు.
0 comments:
Post a Comment