కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నాయా? వాటి వల్ల ముఖం చూడడానికి కళావిహీనంగా కనిపిస్తోందా? అయితే దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించి చూడండి...
న్యూట్రిషస్ డైట్ : విటమిన్-ఎ, విటమిన్-కె, విటమిన్-సి, ఐరన్ లాంటి వాటిని తీసుకోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడవు. అలాగే రోజూ తప్పనిసరిగా సమతులాహారం తీసుకోవాలి. ముఖ్యంగా పళ్లు, సలాడ్లు, మొలకలు, ప్రాసెస్ చేయని ధాన్యాలు, పెరుగు, మీగడ తీసిన పాలు, పనీర్, కాయధాన్యాలు, బీన్స్, ఆకుకూరలు, గుడ్డు, చేపలు బాగా తినాలి. రకరకాల పళ్లు తినడం వల్ల అతిసారవ్యాధిలాంటివి రావు. అయితే మీ డైట్ను మార్చేముందర తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ సలహా ప్రకారం విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లు వాడాలి.
సన్స్ర్కీన్ : బయటకు వెళ్లేముందర మర్చిపోకుండా సన్స్ర్కీన్ లోషన్ని కళ్ల కింద రాసుకోవాలి. ఎక్కువగా రాసుకోకూడదనుకున్నప్పుడు సన్స్ర్కీన్కు కొన్ని చుక్కల నీటిని జోడించి కళ్ల కింద అప్లై చేసుకోవచ్చు.
క్లెన్సింగ్ జెల్ లేదా క్రీమ్ : క్లెన్సింగ్ జల్ లేదా క్రీముతో ముఖానికున్న మేక్పను తొలగించుకోవచ్చు. లైట్ టెక్స్చెర్ ఉండే క్రీములు లేదా సెరమ్స్ను కళ్ల చుట్టూ రాయాలి.
బాదం నూనె : బాదం ఆయిల్ని ఉంగరం పెట్టుకునే వేలితో ఒక నిమిషం పాటు కళ్ల కింద రాయాలి. అక్కడున్న చర్మంపై సున్నితంగా మసాజ్ చేయాలి. అయితే మసాజ్ చేసేటప్పుడు ఒక దిశలోనే చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం తడిగా ఉన్న కాటన్ ఊల్తో సున్నితంగా కళ్ల చుట్టూరా తుడవాలి. బాదంపప్పులు గాని, బాదం ఆయిల్గాని చర్మాన్ని మెరిసేట్టు చేస్తాయి. వాటివల్ల స్కిన్ టోన్ కూడా మారుతుంది. అంతేకాదు కళ్ల కింద ఉన్న చర్మం నునుపుదేలుతుంది.
దోసకాయ, టొమాటో, బంగాళాదుంప, నిమ్మరసం : దోసకాయ కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. అందుకే కళ్ల మీద దోసకాయముక్కల్ని పెట్టుకుని 15 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే కళ్లకు చాలా మంచిది. కళ్లకింది నల్లటి వలయాలను పోగొట్టడానికి మరొక చిట్కా కూడా ఉంది. అదేమిటంటే దోసకాయ, నిమ్మకాయ, టొమాటో రసాలను సమపాళ్లల్లో కలిపి దాన్ని కళ్ల కింద రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే కళ్లకు ఎంతో మంచిది. టొమాటో, బంగాళాదుంప, నిమ్మరసాన్ని కూడా ఈ విధంగానే కలిపి కళ్ల కింద రాసుకుంటే చర్మం రంగులో మెరుపుతోపాటు మృదుత్వం కూడా వస్తుంది. అలాగే దోస, బంగాళాదుంప రసాలను కూడా సమపాళ్లల్లో కలిపి కళ్ల కింద రాసుకుని 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. మీ చర్మం మృదువుగా ఉంటుంది.
వ్యాయామాలు, రిలాక్సేషన్ : ప్రాణాయామాలాంటి శ్వాస వ్యాయామాలు నిత్యం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఊపిరి వ్యాయామాలు మనలోని మానసిక ఒత్తిడిని సైతం పారద్రోలతాయి. అంతేకాదు శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ని అందిస్తాయి. కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలను పోగొడతాయి. అలాగే మంచి నిద్ర, విశ్రాంతిలు కూడా శరీరానికి అవసరం. వీటివల్ల శరీరంతో పాటు కళ్లు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
0 comments:
Post a Comment