అయితే ఈ బాటలో నడవడానికి ఎందుకనో టాలీవుడ్ అగ్ర హీరోలు ఆసక్తి చూపడం లేదు. పవన్-మహేశ్, చరణ్-ఎన్టీఆర్, బన్నీ-ప్రభాస్ వంటి స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం. ఇదే ప్రశ్న సూపర్ మహేశ్‌కు ఎదురైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించడానికి మీరు సిద్ధమేనా? అనే ప్రశ్న ట్విట్టర్‌లో మహేశ్‌కు ఎదురైంది. దీనికి స్పందించిన మహేశ్.. ‘వై నాట్?’ అని బదులిచ్చాడు.
ఈ కాంబినేషన్ కాని తెరకెక్కితే అది కచ్చితంగా మంచి క్రేజీ ప్రాజెక్టు అవుతుంది. ‘బాహుబలి’ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టడం కూడా పెద్ద కష్టం కాదు. ఇది వరకు పవన్ సినిమా జల్సాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇలాంటి క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకుడెవరనేది మాత్రం పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా పవన్-మహేశ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కితే ఈ స్టార్ హీరోలిద్దరి అభిమానులకూ పండగే.
0 comments:
Post a Comment