- నాయిని, కమిషనర్‌తో భేటీ
- తీవ్ర అసంతృప్తి, నివేదిక ఇవ్వాలని ఆదేశం
- బాధితుడిపై ఆత్మహత్యాయత్నం కేసు
- అసలు వివాదం వదిలిన పోలీసులు
బాధితులు ఉండటం నిజం! బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం నిజం! ఆ రక్తాన్ని అప్పటికప్పుడు నీళ్లు పోసి కడిగేయడం నిజం! ఇదం తా... సాక్షాత్తూ తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ముందు జరగడం నిజం! కానీ... ‘ఈ సంఘటనతో నాకేమీ సంబంధంలేదు’ అని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. పోలీసులు.. ‘అసలు కారణం’ వదిలేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నందుకు బాధితుడిపైనే కేసు పెట్టారు. చివరికి... హోంమంత్రి అల్లుడి సెటిల్‌మెంట్ల దందా సీఎం కేసీఆర్‌ను కూడా కదిలించింది. మయూరి టక్కర్ అనే మహిళ నవీన్, సుధీర్‌ల నుంచి రూ.38 లక్షలు అప్పు తీసుకున్నారు. రుణం తీర్చకుండా ఇబ్బంది పెడుతూ... తన భాగస్వామి దీపక్‌తో బెదిరించారు. చివరికి... శుక్రవారం రాత్రి ‘హోంమంత్రి అల్లుడి వద్ద సెటిల్ చేసుకుందాం’ అంటూ నవీన్, సుధీర్‌లను శ్రీనివాసరెడ్డి ఇంటికి రప్పించారు. అక్కడ వీరిపై శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఈ వేధింపులు, దాడి తట్టుకోలేక సుధీర్ అక్కడే ఆత్మ హత్యాయత్నం చేసుకున్నారు. ఈ విషయం శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైంది. దీనిపై నాయిని తన అల్లుడితో మాట్లాడినట్లు సమాచారం. ‘దందా’పై ఆయన మందలించినట్లు కూడా చెబుతున్నారు. ఆ తర్వాత శనివారం ఈ అంశంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. నాయినితోపాటు హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. సుధీర్ ఆత్మ హత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఇదంతా ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందంటూ నాయిని ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాంటివి పునరావృతం కాకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాల్సిందిగా సీపీని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు తన ఇంటి వద్ద చోటుచేసుకున్న సంఘటనతో తనకెలాంటి సంబంధం లేదని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నట్లు సమాచారం.
సుధీర్‌పై కేసు నమోదు
తమకు బాకీ చెల్లించాల్సిన మయూరి టక్కర్, ఆమె వ్యాపార భాగస్వామి దీపక్‌తో కలిసి తమపై దాడి చేయించిందని నవీన్, సుధీర్‌లు ఆరోపించారు. శుక్రవారం రాత్రి తమను శ్రీనివాస రెడ్డి ఇంటికి పథకం ప్రకారం రప్పించారని... తల్వార్లతో దాడి చేశారని తెలిపారు. తమ సొంత ఇల్లు తాకట్టు పెట్టి మరీ మయూరి టక్కర్‌కు డబ్బులిచ్చామని సుధీర్ భార్య కన్నీటి పర్యంతమయ్యారు. ఏ క్షణం ఏం జరుగుతుందోన నే ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. నాయిని అల్లుడి ఇంటి ముందు బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సుధీర్‌పై నారాయణగూడ పీఎస్‌లో సెక్షన్ 309 కింద కేసు నమోదు చేశారు.
0 comments:
Post a Comment