రాష్ట్రంలో డీజిల్,
పెట్రోల్‌పై లీటరుకు అదనంగా రూ. 4 పెంచిన వ్యాట్‌టాక్స్‌ను రద్దు చేయాలని
డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీ అర్థరాత్రి నుంచి 31వ తేదీ అర్థరాత్రి
(ఒక్కరోజు) వరకు రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో అమ్మకాలు, కొనుగోళ్లు
నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్
రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. గుంటూరులో మంగళవారం జరిగిన
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై
లీటరుకు రూ. 4 వ్యాట్‌టాక్స్‌ను విధించడంతో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని
ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఆర్థికంగా
నష్టపోతున్నారని పేర్కొన్నారు. 6 నెలలుగా తగ్గిపోయిన అమ్మకాలకు సంబంధించి
గణాంకాలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. దీనిపై
స్పందించిన ముఖ్య మంత్రి నలుగురు మంత్రులు యనమల రామకృష్ణుడు, సిద్దా
రాఘవరావు, అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చిన రాజప్పలతో మంత్రి వర్గ ఉపసంఘాన్ని
ఏర్పాటు చేశారన్నారు. మంత్రి వర్గ ఉపసంఘంతో సమావేశమైన తాము సమస్యలను
వివరించామన్నారు.
0 comments:
Post a Comment