Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Lowrance donated 1croce to poor in the name of Kalam


    దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంపేరిట పేదలకు సాయం చేసేందుకు ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ ముందుకొచ్చారు. రూ.కోటి విరాళంతో పేదలను ఆదుకోనున్నట్టు ప్రకటించారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటిస్తున్న రెండు కొత్త ప్రాజెక్టులను లారెన్స్‌ చెన్నైలో సోమవారం రాత్రి ప్రారంభించారు. ‘మొట్టశివ కెట్టశివ’, ‘నాగ’ అనే రెండు చిత్రాలను వేందర్‌ మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ‘మొట్టశివ కెట్టశివ’ చిత్రానికి పారితోషికంగా అందుకున్న రూ.కోటి అడ్వాన్స్‌ను కలాం పేరిట పేదలకు సాయం చేయనున్నట్టు ప్రకటించారు. 100 మంది నిజాయితీగల యువతీ యువకులను ఎంపికచేసి తలా లక్ష చొప్పున కేటాయించి, వారిద్వారా నిజంగా అవసరంలో ఉన్న పేదలకు సాయం అందించేలా ఓ ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. అలాగే నటీనటులు, సినీ కళాకారులందరినీ కలాం పేరిట సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరపున కలాం పేరుతో సాయం అందిస్తాననీ, అలాగే యువతకు కలాం పేరిట పురస్కారాలు అందజేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. సినీ కళాకారులను పోషిస్తున్న ప్రేక్షకులకు తిరిగి ఏదైనా చేయాలన్న తలంపుతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు లారెన్స్‌ తెలిపారు. 100 మందిలో తొలి యువతిగా తమిళ నటి దివ్యదర్శిని ఎంపికైంది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Lowrance donated 1croce to poor in the name of Kalam Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top