- విద్యుత్ ఉపకరణాలకు వినూత్న పథకం
- కేంద్రం సహకారంతో ఏపీ సర్కార్ కొత్త ఆలోచన
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గృహంలోనూ 5 స్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్తు గృహోపకరణాలు వాడేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం విద్యుత్తు వినియోగదారులకు 5 స్టార్ విద్యుత్తు గృహోపకరణాలను సులభవాయిదాలపై అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్తు పొదుపు, సంరక్షణ విధానాలపై బుధవారం సచివాలయంలో ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఇతర ఉన్నతాధికారులతో స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఎస్‌ఈసీఎం) చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. అతి తక్కువ విద్యుత్తును వినియోగించే 5 స్టార్ రేటింగ్ ఉపకరణాల వాడకంలో దేశంలోనే అగ్రగామిగా ఉండేందుకు వినూత్న ఆలోచనతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, కుక్కర్, ఫ్యాన్లు, లైట్లు, వ్యవసాయ పంప్‌సెట్లు వంటివి వాడడం ఇప్పుడు అతి సాధారణమైపోయింది. గృహోపకరణాలన్నీ 5 స్టార్ రేటింగ్ ఎలకా్ట్రనిక్ ఉపకరణాల వాడకాన్ని ప్రోత్సహించాలంటే.. వారికి అందుబాటులో నాణ్యమైన వస్తువులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయమై ఇప్పటికే స్టేట్ ఎనర్జీ కన్వర్వేషన్ మిషన్.. కేంద్ర సంస్థ.. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎ్‌సఎల్)తో సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో రెండున్నర కోట్ల ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేసేందుకు సహకరిస్తోన్న ఈ సంస్థ.. టోకు ధరలకు సులభవాయిదాల విధానంపై ఎలకా్ట్రనిక్ ఉపకరణాలను అందించేందుకు కూడా ప్రాథమికంగా ఆమోదించింది.
0 comments:
Post a Comment