
కృష్ణా,ఆగస్టు 15: గుడివాడలో ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. స్వాతంత్ర్యదినోత్సం సాక్షిగా ఈ ఘటన కృష్టాజిల్లాలో జరిగింది. యువతి గుడివాడలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుల కోసం గాలిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకున్నామని నేడు 69వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. కాని స్వాతంత్ర్య భారతదేశంలో మహిళలపై నిత్యం ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఇంకెప్పుడు మహిళలు సమాజంలో తిరగగలుగుతారు అని మహిళా సంఘాలు వాపోతున్నాయి.
0 comments:
Post a Comment