మాటతప్పని గూండా.. సాహసించిన పోలీసులు
ఆగ్రా రెడ్‌లైట్ ఏరియాలో డేరింగ్ ఆపరేషన
ఏళ్ల తరబడి వ్యభిచార కూపంలో నరకం అనుభవిస్తున్న ఒక బాలికకు స్థానిక గూండా విముక్తి కల్పించి, మరికొందరు బాలికలు వ్యభిచార కూపం నుంచి బయటపడేందుకు మార్గం సుగమం చేశాడు. ఆగ్రాలో రెడ్ లైట్ ఏరియాగా పేరున్న ‘కశ్మీర్ బజార్’లో ఇటీవల ఈ ఘటన జరిగింది.
ముంబైకి చెందిన ఓ బాలికను 2007లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, ఆగ్రాలోని కశ్మీర్ బజార్‌లో అమ్మేశారు. తన వద్దకు క్లయింట్‌గా వచ్చిన గూండాకు ఆ బాలిక తన కష్టాన్ని చెప్పుకుంది. బాలిక కష్టాన్ని విన్న ఆ గూండా సహాయం చేస్తానని మాటిచ్చాడు. అందుకోసం ఒక పథకం వేసుకున్నాడు. అందులో భాగంగా వ్యభిచార గృహానికి తన గ్యాంగ్‌ను కూడా క్లయింట్లుగా తీసుకువెళుతూ వ్యభిచార గృహం యజమానురాలి వద్ద బాగా నమ్మకం పెంచుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ బాలికను అక్కడ నుంచి తప్పించాడు. గూండా సాయంతో నరకకూపం నుంచి బయటికొచ్చిన ఆ బాలిక మొత్తం విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కశ్మీర్ బజార్‌లో తన లాంటి బాలికలు ఎంతో మంది ఉన్నారని, వారందరూ ప్రతిరోజూ నరకం అనుభవిస్తున్నారని ఆ బాలిక కన్నీరు పెట్టుకుంది. వారందరినీ కూడా అక్కడి నుంచి తప్పించాలనుకొంది. వెంటనే బాలిక ముంబై పోలీసులను ఆశ్రయించింది. తాను ఎలా కిడ్నాపయింది.. తనను అక్కడ ఎలా చిత్రహింసలకు గురిచేసింది, అలాగే తనను ఆ గూండా అక్కడి ఎలా తప్పించాడో మొత్తం పోలీసులకు వివరించింది.
బాలిక సమాచారంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఆగ్రాలోని కశ్మీర్ బజార్ అంటే లోకల్ పోలీసులు కూడా భయపడతారు. పోలీసులను చంపడానికి సైతం వెనుకాడని అలాంటి ప్రదేశానికి వెళ్లడానికి ముంబై పోలీసులు సాహసించారనే చెప్పొచ్చు. పథకం ప్రకారం అనుకున్నది సాధించారు. కశ్మీర్ బజార్‌లోని వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. దాదాపు 20 మంది బాలికలకు నరకం నుంచి విముక్తి కల్పించారు. ఇదంతా అక్కడి ఐజీ ఆర్కే మిశ్రా సాయంతోనే సాధించగలిగామని ముంబై పోలీసులు చెప్పుకొచ్చారు. సైకిల్ కూడా వెళ్లలేని ఇరుకుదారుల్లో వెళ్లి 13 నుంచి 15 నిమిషాల్లో ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన పోలీసులను ముంబై పోలీస్ బాస్ అభినందించారు.
0 comments:
Post a Comment