Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Cm Chandrababu Naidu plans or cabinet reshuffle

    ఏపీ క్యాబినెట్‌లో ప్రక్షాళన జరగనుందా? మూడునెలల్లో మార్పులు- చేర్పులు జరగవచ్చంటూ వార్తలు వెలువడుతున్నాయి. సడన్‌గా మార్పు ఏంటంటూ అప్పుడే పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ మొదలైంది. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత మంత్రుల, ఎమ్మెల్యేల పనితీరుపై బాబు ఓ సర్వే నిర్వహించిన విషయం తెల్సిందే! ప్రభుత్వ పథకాల మీద ప్రజలేం అనుకుంటున్నారు లాంటి ఎన్నో విషయాలు ఈ సర్వేలో వెల్లడయ్యాయి. ఐతే, బాబు చేయించిన ముఖ్య ఉద్దేశం మాత్రం వేరే వుందని అప్పట్లోనే వార్తలొచ్చాయి. మంత్రుల పనితీరు కంటే ఎమ్మెల్యేలే బాగా పర్‌ఫార్మెన్స్‌ చేస్తున్నారని సర్వే సాధించిన అసలు సారాంశం.


    తరచూ పర్యటనలు జరుపుతూ జనంలో తిరుగుతున్నట్లు కనిపిస్తున్న మంత్రులు, పనితీరు విషయంలో మాత్రం బాగా వెనుకబడటంపై అప్పుడే పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. కొంతమందైతే జిల్లాలకే వెళ్లడం లేదని కూడా తేలిందట. సీనియర్లను కాదని కొత్తవారికి పదవులు ఇచ్చినా సరైన ప్రతిభ చూపించలేదని అధినేత భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన మంత్రుల కంటే పదవులు దొరకని ఎమ్మెల్యేలే చురుగ్గా పనిచేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చారట. దీనికి సంబంధించి సమగ్రమైన ఓ నివేదికను కూడా రెడీ చేసినట్టు పార్టీలో చర్చ. నలుగురు మంత్రులకు నెగిటివ్ మార్కులు ఎక్కువ పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడునెలల్లో తమతమ పర్‌ఫామెన్స్‌ మెరుగుపరచుకోకపోతే వాళ్లని తొలగించాలనే సంకేతాలు కూడా  ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన మరో మూడునెలల్లో బాబు క్యాబినెట్‌లో ప్రక్షాళన ఖాయమని తేలిపోయింది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Cm Chandrababu Naidu plans or cabinet reshuffle Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top