Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Anasuya going to act in nagarjuna's soggade movie


    చూడగానే అచ్చ తెలుగమ్మాయిగా కనిపించే అందాల తార యాంకర్ అనసూయ. బుల్లితెర యాంకర్‌గా అనతి కాలంలోనే తెలుగు ప్రజలందరికి సుపరిచితమైన ఆమెకు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. నిన్నమొన్నటి వరకు యాంకరింగ్‌కే పరిమితమైన ఈ బొద్దుగుమ్మకు దర్శకులు వరుస ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా నాగార్జున కొత్త చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు అనసూయను ఐటమ్ సాంగ్స్ చేయాల్సిందిగా దర్శకులు కోరుతున్నారట. ఇందుకు ఈ అమ్మడు కూడా సరేనందని తెలిసింది. అయితే తనకు ఇంత క్రేజ్ తెచ్చిన టీవీ షోస్‌ను మాత్రం ఆమె వదులుకోనంటుంది. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చినంత మాత్రాన యాంకరింగ్‌ను ఎందుకు వదులుకోవాలని ఈ బ్యూటీ ఎదురు ప్రశ్నిస్తోందట. కానీ యాంకరింగ్ నుంచి సినీరంగంలోకి వెళ్లిన ఉదయభాను కూడా ఇలాగే మాట్లాడిందని, కానీ సినిమాల్లోకి వెళ్లిన తర్వాత బుల్లితెర వైపు కన్నెత్తి చూడలేదని బుల్లి తెర ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. యాంకర్ కదా ఆ మాత్రం మాటలు చెప్పకపోతే ఎలా? అంటున్నారు సినీ జనం.


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Anasuya going to act in nagarjuna's soggade movie Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top