Allu Aravind did Wrong Say's Rajamouli
బాహుబలి బ్లాక్బస్టర్ హిట్తో ఫుల్ జోష్మీదున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. యూరప్ ట్రిప్ నుంచి ఇటీవలే తిరిగి వచ్చిన ఆయన బాహుబలి 2 స్ర్కిఫ్ట్, ఇతర పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన ఓ ప్రముఖ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమా మార్కెట్, స్థాయి బాహుబలితో దేశవ్యాప్తంగా తెలిసిందని ఈ విషయంలో తాను ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు చెప్పారు.గతంలో రాంచరణ్తో మగధీర సినిమా తీసినప్పుడే తాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని నిర్మాత అల్లు అరవింద్కు సూచించానని..అయితే మగధీర ఇక్కడ రిలీజ్ అయ్యాక..సంవత్సరం తర్వాత తమిళంలో రిలీజ్ చేశారని..అయితే అప్పటికే ఆ సినిమాకు ఉండాల్సిన స్థాయిలో క్రేజ్ లేదన్నారు. సంవత్సరం తర్వాత మగధీరను కోలీవుడ్లో రిలీజ్ చేసినా రూ.4 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిందని..అదే తెలుగుతో పాటు సమానంగా కోలీవుడ్లో మగధీరను రిలీజ్ చేస్తే అప్పుడే ఓ రేంజ్లో వసూళ్లు రాబట్టేదని జక్కన్న తెలిపాడు.
మగధీరకు మరింత వసూళ్లు రావాల్సి ఉన్నా… అల్లు అరవింద్గారు చేసిన తప్పు వల్లే కోలీవుడ్లో మంచి వసూళ్లను కోల్పోయిందని జక్కన్న తెలిపారు.ఇక మయదొంగ సినిమా ఓన్లీ తెలుగు ట్రెండింగ్కు అనుగుణంగా మాత్రమే తీసిన సినిమా అని..అందువల్లే దానిని ఇతర భాషల్లో రిలీజ్ చేయలేదని ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment