వెబ్
బ్రౌజర్ పోరు మళ్లీ మొదలైంది.
ఇప్పటికే అత్యంత ఆదరణ పొందిన గూగుల్
క్రోమ్ బ్రౌజర్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్
సరికొత్త బ్రౌజర్ను విడుదల చేయనుంది.
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చే
ఈ బ్రౌజర్ పేరు ‘ఎడ్జ్’. ఇది
క్రోమ్ బ్రౌజర్కన్నా చాలా మెరుగ్గా
ఉంటుందని టెక్నాలజీ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.
గూగుల్ క్రోమ్‌తో పోల్చితే ఇది
112 శాతం వేగంగా ఫలితాలను అందిస్తుందని కూడా అంటున్నారు. చెబుతున్నట్టుగానే
ఎడ్జ్ ఫీచర్లు, పని తీరు ఉంటే..
రానున్న కాలంలో విండోస్ను వినియోగించే వారంతా
దీనికే మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఎడ్జ్
రంగ ప్రవేశం చేయగానే క్రోమ్ సరికొత్త ఆవిష్కరణలు చేయాల్సి ఉంటుందని, లేకుంటే క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Download Microsoft Edge HERE::
0 comments:
Post a Comment