ప్రిన్స్
మహేష్‌బాబు ఇద్దరు కోలీవుడ్ స్టార్
డైరెక్టర్ల మధ్యలో నలుగుతున్నాడు.
ఆయన నటించిన
తాజా చిత్రం శ్రీమంతుడు ఆగస్టు 7న
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్
అవుతోంది. ఈ సినిమాతో తమిళంలో మార్కెట్ పెంచుకునేందుకు ప్రిన్స్ అడుగులు వేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ
సినిమా ప్రమోషన్
ఇంటర్వ్యూలో మహేష్ కోలీవుడ్లో తాను సినిమా
చేస్తే ఏఆర్.మురుగదాస్
డైరెక్షన్ అంటే తనకు చాలా
ఇష్టమని ఆయన డైరెక్షన్లో తాను సినిమా
చేస్తానని చెప్పారు.
మహేష్ దృష్టి మురుగదాస్ మీద ఉంటే
ఆయనతో సినిమా
చేయడానికి ఇద్దరు కోలీవుడ్
స్టార్ డైరెక్టర్లు రెడీ అయిపోయారు.
వాళ్లే మురుగదాస్, లింగుస్వామి.
మురుగదాస్ అంటే కొత్త
కథలు, కొత్త
స్ర్కీన్ప్లే ఉంటుంది. గజిని, తుపాకీ, స్టాలిన్
ద్వారా ఆయన మనకు సుపరిచితుడే. గతంలోనే మురుగదాస్ కూడా మహేష్‌కు కథ వినిపించాడు… ఇప్పుడు
మహేష్ కూడా మురుగదాస్ తో జోడీ
కట్టడానికి రెడీ
అయిపోయాడు.
అయితే
మరో స్టార్ డైరెక్టర్ లింగుస్వామి మహేష్‌కు గతంలోనే కథ చెప్పి
..అప్పటి నుంచి మహేష్ కాల్షీట్ల కోసం
ట్రై చేస్తున్నాడు. మాస్ ఫల్స్ బాగా
తెలిసిన లింగుస్వామి మహేష్‌తో
ఓ మాస్ కమర్షియల్ మూవీ
తీసేందుకు స్టోరీ రెఢీ చేసుకున్నారట.
అయితే
ఇప్పుడు ఈ ఇద్దరి
స్టార్ డైరెక్టర్లలో మహేష్ ఎవరితో
జోడీ కడతాడా
అన్నది ఆసక్తిగా
ఉంది. వీరిలో ఎవరితో మహేష్ సినిమా చేసినా
అది ద్విభాషా చిత్రంగానే తెరకెక్కనుంది.
0 comments:
Post a Comment