ఏపీ క్యాబినెట్లో ప్రక్షాళన షురూ అయ్యింది.
ఇప్పటికే ఇందుకు సంబంధించి
ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు
డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్నరాజప్పను మార్చేందుకు
వెనుకంజ వేసేలా లేరు. ఆయన
స్థానంలో గంటా శ్రీనివాసరావును తీసుకునే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి.
వాస్తవానికి నిమ్మకాయల,
గంటా ఇద్దరూ కాపు
సామాజిక వర్గానికి చెందినవారే! ఒకరిది
తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం అయితే,
మరొకరిది ప్రకాశం జిల్లా. అంతేకాదు
సొంత జిల్లా కన్నా ఉక్కు
నగరి విశాఖలోనే పటిష్టమైన
క్యాడర్ ఉన్న వ్యక్తి. పారిశ్రామికవేత్త కూడా.
అనేకానేక పర్యాయాలు వివిధ
పార్టీలలో చేరినప్పటికీ
ఆయా సందర్భాల్లో తన హవాకు
లోటు రాకుండా జాగ్రత్తపడ్డారు.
ఇక నిమ్మకాయల విషయానికి వస్తే.. ఎన్నికల హామీ మేరకు బీసీలకే
బాబు.. డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టినప్పటికీ, పగ్గాలు చేపట్టిన నాటి
నుంచి ఆయన పెద్దగా పనితీరు
ప్రదర్శించింది లేదు.
కీలక సందర్భాల్లో
చురుగ్గా వ్యవహరించిందీ లేదు. ఈ నేపథ్యంలో పెద్దగా ప్రాబల్యం లేని నిమ్మకాయలను
తప్పించినా తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి
వచ్చే నష్టమేమీ ఉండదు.
నిమ్మకాయలకు
కేటాయించిన హోం శాఖను
కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నకు అప్పగించి,
ఆయనను అప్రాధాన్య
శాఖకు మంత్రిగా నియమించినా ఆశ్చర్యపోనవసరం
లేదు. ఇటీవల ఎమ్మెల్సీలుగా
ఎన్నికైనా సీనియర్లకు
తగు ప్రాధాన్యం ఇచ్చి
క్యాబినెట్లో మార్పులూ చేర్పూలూ
చేయాలన్నది చంద్రబాబు భావన.
ఇందుకు
అనుగుణంగానే సోమిరెడ్డి, పయ్యావుల వంటి
సీనియర్లకు చోటిచ్చి,
పీతల, రావెల వంటి
వారిని ఇంటికి సాగనంపుతారు. ఈ
క్రమంలోనే నిమ్మకాయలకు కూడా పదవీ గండం
షురూ కానుంది. సుదీర్ఘకాలంగా పార్టీ విధేయుడిగా ఉండడం మినహా క్యాడర్ను బలోపేతం
చేయడంలో గానీ గోదావరి పుష్కర
సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులెత్తించడం కానీ ఆయన చేయలేదు.
ఇవన్నీ ఇవాళ నిమ్మకాయలను
ఇంటిబాట పట్టించనున్నాయి.
0 comments:
Post a Comment