Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    సాయిధరమ్ తేజ్ ‘తిక్క’ ప్రారంభం

    శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న నూతన చిత్రం ‘తిక్క’. ఈ చిత్రం ఈరోజు (జూలై 31) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్ సరసన లారిస్సా బోనేసి కథానాయికగా నటిస్తోంది. పూజా కార్యక్రమాలు జరిపిన తర్వాత ఈ సినిమా స్ర్కిప్ట్‌ను డైరెక్టర్ సునీల్ రెడ్డికి నాగబాబు అందించారు. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు ముహుర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో టి.టి.డి.పి.నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, దర్శకుడు కొరటాల శివ, హీరో సునీల్, నవీన్ విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ...‘‘ఇందులో నా పేరు ఆదిత్య. ఈ చిత్రంలో నేను ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే పాత్రలో నటిస్తాను. హీరోయిన్‌తో ప్రేమలో పడిన తర్వాత కొన్ని కారణాలతో వారి మధ్య గొడవలు వస్తాయి. దాంతో హీరోకి తిక్కరేగుతుంది. అందుకే ఈ సినిమాకి ‘తిక్క’ అనే టైటిల్‌‌ను పెట్టారు. చివరికి హీరో హీరోయిన్ ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేదే సినిమా కథ’’ అన్నారు.

    దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ...‘‘ ఎవరి లైఫ్‌కి వారే హీరో. కానీ ఈ సినిమాలో హీరో లైఫ్‌కి హీరోనే విలన్. ఇదో ఫన్ గోయింగ్ మూవీ. రాజేంద్ర ప్రసాద్ హీరో ఫాదర్‌గా నటిస్తుండగా...రావు రమేష్ హీరోయిన్ ఫాదర్‌గా నటిస్తున్నారు. ఆగస్ట్ 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డిసెంబర్‌కి షూటింగ్‌ను పూర్తి చేసి ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేయడాని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

    నిర్మాత సి.రోహిణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...‘‘ ఈ స్టోరీ వినగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నిర్మాతగా నా తొలి సినిమా ఇది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

    తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, ఆలీ, తాగుబోతు రమేష్, అజయ్, వెన్నెల కిషోర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: సాయిధరమ్ తేజ్ ‘తిక్క’ ప్రారంభం Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top