మహేశ్
బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
'శ్రీమంతుడు' చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు పొక్కాయి... అందులో
ముఖ్యమైనది ఈ సినిమా ఇంటర్వెల్
బ్లాక్ లో వచ్చే సీన్...
ఈ సన్నివేశం చూస్తే ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందేనట!... మహేశ్ కు బ్లాక్
బస్టర్ హిట్స్ గా నిలచిన 'పోకిరి,
దూకుడు' చిత్రాల్లో కూడా ఇంటర్వెల్ కు
ముందు వచ్చే సీన్స్ అదిరిపోయాయి...
అందువల్లే 'శ్రీమంతుడు' కూడా ఆ రేంజ్
లో ఆకట్టుకొనే ఓ ఉత్కంఠభరితమైన సన్నివేశాన్ని
ఇంటర్వెల్ కు ముందు పొందుపరిచారట...
అలాగే కొరటాల శివ తొలి చిత్రం
'మిర్చి'లో కూడా ఇంటర్వెల్
కు ముందు వచ్చే యాక్షన్
ఎపిసోడ్ అందరినీ అలరించింది... అదే తీరున 'శ్రీమంతుడు'లో మహేశ్ బాబు,
హరీశ్ పై ఓ యాక్షన్
ఎపిసోడ్ ను చిత్రీకరించారట... ఈ
విషయం మహేశ్ ఫ్యాన్స్ కు
పరమానందం పంచుతోంది...
ఇక 'శ్రీమంతుడు'కు సంబంధించిన రెండో
విశేషమేమంటే- ఈ చిత్రంలో మొత్తం
ఆరు పాటలున్నాయట... ఆరు పాటలుంటే చాలు
మహేశ్ సినిమా అదిరిపోవలసిందే అంటున్నారు ఆయన ఫ్యాన్స్... 'శ్రీమంతుడు'
చిత్రానికి దేవిశ్రీఫ్రసాద్ సంగీతం సమకూర్చాడు... ఇంతకు ముందు మహేశ్
హీరోగా నటించిన 'వన్-నేనొక్కడినే' చిత్రానికి
దేవిశ్రీ స్వరకల్పన చేశాడు... అయితే ఆ సినిమా
ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది... దాంతో 'శ్రీమంతుడు'ను మ్యూజికల్ హిట్
గా మలచాలని దేవిశ్రీ భలేగా శ్రమించాడట... ఇక
ఈ సినిమాలోని పాటల పెట్టెలోని జాబితా
విషయానికి వస్తే- మొదట "రామ రామ..." అనే
పాట వినిపించగా, తరువాత "జత కలిసే..." అనే
పాట, "చారుశీల..." అనేది మూడోపాటట!... ఇక
నాలుగో పాట "శ్రీమంతుడా..." అని మొదలవుతుందట, "జాగో...జాగో..."
అనేది ఐదో పాట, 'దిమ్మ
తిరిగే...' అనేది చివరి పాట...
ఇలా మొదలయ్యే ఆరు పాటలూ ఉర్రూతలూగించేలా
ఉన్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... ఈ నెల 18న
'శ్రీమంతుడు' పాటలు విడుదల కానున్నాయి...
ముందే పాటల సంగతి తెలిసింది
కాబట్టి, మహేశ్ ఫ్యాన్స్ మరింత
ఆనందంగా ఈ పాటలు వింటూ
ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు...మరి 'శ్రీమంతుడు' పాటలు
మహేశ్ ఫ్యాన్స్ ను ఏ తీరున
అలరిస్తాయో, సినిమాను ఏ తీరాలకు చేరుస్తాయో
చూద్దాం...
0 comments:
Post a Comment