బాహుబలి సినిమా చివర్లో అమరేంద్ర
బాహుబలి (ప్రభాస్)ను కట్టప్ప(సత్యారాజ్)
పొడిచి చంపాడు. ఈ సీన్తోనే
బాహుబలి ది బిగినింగ్
పార్ట్ ఎండ్ అవుతుంది. అయితే
అసలు కట్టప్ప తాను ఎంతో
అభిమానించే మాహిష్మతి ప్రజల దైవం బాహుబలిని ఎందుకు చంపాడన్న డౌట్ అందరిలోను వ్యక్తమైంది.
ఇందుకు ఎవరు తోచినట్టు వారు ఊహించేసుకుని
భల్లాలదేవుడు పొడవమన్నాడని..రాజు ఆదేశం
పాటించేందుకే కట్టప్ప
అలా చేశాడని..కాదు
కాదు శివగామి సూచన మేరకే
కట్టప్ప ఇలా
చేశాడని ఎవరికి
వారు చర్చించుకున్నారు.
ఇక సోషల్ మీడియాలో
అయితే కట్టప్ప
భోజనం చేస్తుంటే బాహుబలి ప్లేటు లాక్కున్నాడని ..ఆ కోపంతోనే
కట్టప్ప పొడిచి
బాహుబలిని చంపేశాడని
జోకులు కూడా పేలాయి. అయితే
ఈ విషయంపై బాహుబలి
కథ సృష్టికర్త దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరో ఆసక్తికర ట్విస్ట్
ఇచ్చాడు. బాహుబలిని కట్టప్పే చంపాడనుకోవడం
పొరపాటని… కట్టప్ప బాహుబలిని కేవలం
పొడిచాడని… బాహుబలి మరణానికి
అసలు కారకులు వేరే ఉన్నారని చెప్పాడు.
ఇప్పటికే బాహుబలి
2 గురించి రకరకాల కథలు ప్రచారంలోకి
వచ్చాయి. ఇక ఈ ట్విస్టులు
చాలదన్నట్టు
జక్కన్న కూడా
బాహుబలి 2లో మరో రెండు మూడు
ఆసక్తికర ట్వీస్టులు
జోడించాడట. దీంతో బాహుబలి 2 మరింత
రక్తికట్టనుందని టాక్. ఏదేమైనా
బాహుబలి ది బిగినింగ్
పార్ట్లో కట్టప్ప ట్విస్ట్కు
మరో కొత్త ట్విస్ట్
ఇచ్చిన విజయేంద్రుడు ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ
రేకెత్తించాడు. ఈ ట్విస్టుల సమాధానాలకు బాహుబలి
2 వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
0 comments:
Post a Comment