Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

      Snake in bottle

      ఇప్పటివరకు కూల్ డ్రింక్ లలోనే మనం అద్భుతాలు చోటు చేసుకోవడం చూశాం. ఇప్పుడు వాటర్ బాటిళ్ళలో కూడా పాములు గట్రా విష పురుగులు వస్తున్నాయి. తాజాగా ఛత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ లో వాటర్ బాటిల్ లో పాము కనిపించిన ఘటన సంచలనంగా రేపుతుంది.


      తాజాగా రాయ్ పూర్ లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేంద్ర వైద్యమంత్రి జెపి నద్దాకు, ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు ఇచ్చిన వాటర్ బాటిల్ లో పాము పిల్ల ఉండడం గమనించారు. మొదట రమణ్ సింగ్ మెడికల్ టీం లోని ఓ మహిళా డాక్టర్ ఈ పాము పిల్లను గుర్తించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా, వాటర్ బాటిల్ పై అమన్ ఆక్వా అని ఉంది. అయితే, అమన్ ఆక్వా కంపెనీ బీజేపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అలీ అమన్ ది అని సమాచారం. ఈ సందర్భంగా అమన్.. తన బిజినెస్ ని, ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కుట్ర పన్నారని ఆరోపించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎటువంటి తనిఖీలు జరగకుండా వాటర్ బాటిల్ ను ఎలా తీసుకొచ్చారనే దానిపై విచారణ జరుగుతుంది. అయితే, ఇది పొరపాటుగా జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
      • Blogger Comments
      • Facebook Comments

      0 comments:

      Post a Comment

      Item Reviewed: Snake in bottle Rating: 5 Reviewed By: Andhrula Mp3