Robbery in TTD temple
తిరుమల
శ్రీవారి ఆలయ హుండీలో చోరీకి
పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు
అరెస్టు చేశారు. విచారణలో అతను బీటెక్ విద్యార్థిగా
గుర్తించారు. బెంగళూరుకు చెందిన బీటెక్ విద్యార్థి రఘు శ్రీవారి దర్శనార్థం
తిరుమల వచ్చాడు. బుధవారం రాత్రి ఆలయం చేరుకుని స్వామివారిని
దర్శించుకున్నాడు. అనంతరం హుండీ వద్దకు చేరుకుని
మొక్కులు చెల్లిస్తున్నట్లు చేతులు హుండీలోకి చాపాడు. ఇతర భక్తులు వేస్తున్న
కానుకలను అదే చేత్తో పట్టుకుని
జేబులో వేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ దృశ్యాలను సీసీ
కెమెరాల ద్వారా గుర్తించిన భద్రతా విభాగం వెంటనే అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అప్పటికే అతను హుండీ ఉన్న
ప్రదేశం నుంచి జారుకుంటుండగా గుర్తించి
అదుపులోకి తీసుకున్నారు. సోదా చేయగా.. రూ.13,400నగదు లభించింది. ఆ
నగదును స్వాధీనం చేసుకుని నిందితుడిని గురువారం ఉదయం క్రైం పోలీసులకు
అప్పగించారు.
0 comments:
Post a Comment