కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ ‘శ్రీమంతుడు’గా వచ్చి అభిమానుల ఆశల్ని నిలబెట్టుకున్నాడు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తూ....బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రంపై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా సక్సెస్‌పై శ్రీమంతుడు చిత్ర యూనిట్‌కు రాజమౌళి అభినందనలు తెలిపాడు. దత్తత కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్‌తో అందర్ని ఆకట్టుకుంది. వెల్‌డన్ శివగారు..ఇది పైసా వసూలు చిత్రం అంటూ ట్విట్ చేశాడు. మహేశ్, శృతిహాసన్ నటన అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ మది పని తనంతో పాటు దర్శకుడు కొరటాల శివ విజన్ ఎక్స్‌లెంట్‌గా ఉందన్నారు. నా కుటుంబం అంతా కలిసి సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసామని ట్విటర్ ద్వారా రాజమౌళి తెలిపాడు. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ట్విట్ చేశాడు.
0 comments:
Post a Comment