- ప్రత్యేక’ హామీ ఇవ్వనున్న ప్రధాని!
- 16- 19 మధ్య ఢిల్లీకి ముఖ్యమంత్రి
- హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి
- ప్రధాని, మంత్రుల దృష్టికి సమస్యలు
- తాజా పరిణామాలపై మంత్రులు,సీనియర్లతో చంద్రబాబు భేటీ
- కాంగ్రెస్‌కు మాట్లాడే హక్కు లేదని వ్యాఖ్య
ప్రధాని మోదీ వచ్చే నెల ఏపీ పర్యటనకు రానున్నారు. బీహార్ ఎన్నికలు ముగిసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని మోదీ భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల సినీ నటుడు ప్రభాస్ ప్రధాని మోదీని కలిశారు. ఆ సమయంలో ప్రభాస్‌తో పాటు ఉన్న ఓ బీజేపీ నేతతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటివరకు ఏపీకి కేంద్రం చేసిన సాయం గురించి ప్రజలకు తెలియజెప్పడంలో పార్టీ నేతలు విఫలమైనట్లు మోదీ అభిప్రాయపడ్డారని సమాచారం. అంతేకాకుండా బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే ఏిపీకి ప్రత్యేక సాయాన్ని అందించలేకపోతున్నామని, బీహార్ ఎన్నికల తరువాత ఏపీలో పర్యటించి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా తిరుపతి కాంగ్రెస్ పోరు సభలో మునికోటి ఆత్మాహుతి యత్నం చేయడంపై ఢిల్లీలోని కాంగ్రెస్, బిజేపీ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించరు. ఈ మేరకు ఆయన త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత 16- 19 తేదీల మధ్యలో ఢిల్లీ యాత్ర పెట్టుకోవాలని ఆయన నిర్ణయించారు. ప్రధాని సహా కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి తదితరులను కలుసుకోవడానికిచ అపాయింట్‌మెంట్లు ఖరారు చేయాలంటూ ఢిల్లీలోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని ఆయన ఆదేశించారు. ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో కోటి అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన నేపఽథ్యంలో శనివారం సాయంత్రం ఆయన ఇక్కడ లేక్‌వ్యూ అతిఽథి గృహంలో మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. మంత్రులు కేఈ కృష్ణమూర్తి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రతి శనివారం ప్రజా ప్రతినిధులతో సమావేశవుతున్న ఆయన అందులో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. అదే సమయానికి తిరుపతి సంఘటన జరగడంతో చర్చ దానిపైకి మళ్లింది. ఈ సమావేశం నుంచే చిత్తూరు ఎస్పీకి చంద్రబాబు ఫోన్ చేసి సంఘటన వివరాలు తెలుసుకొన్నారు. ఆత్మహత్యాయత్నం చేసుకొన్న కోటికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని, అందులో ఏ లోపం రానివ్వవద్దని ఆయన ఆదేశించారు. ప్రత్యేక హోదాతోపాటు ఇతర హామీలను సాధించడానికి ఇప్పటివరకూ జరిగిన కృషిని...భవిష్యత్ కార్యాచరణను ఆయన పార్టీ నేతలతో సమీక్షించారు. ‘‘మన పొరుగు రాషా్ట్రలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పోలిస్తే ఆదాయం, వనరులు, వసతుల పరంగా మనం చాలా వెనకబడి ఉన్నాం. అశాసీ్త్రయ రాష్ట్ర విభజన వల్లే మనకు ఈ పరిస్థితి వచ్చింది. విభజన చేసిన కేంద్రానికి ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇతర రాషా్ట్రలతో పోటీపడగలిగే పరిస్థితి వచ్చేవరకూ కేంద్రం మనకు సహకరించాలి. ఇందులో రాజీ లేదు. ఇదే విషయాన్ని మనం అనేకసార్లు కేంద్రానికి చెప్పాం. మరో వందసార్లయినా చెబుదాం. మనకు ఏం కావాలో వాటిని రాబట్టుకొందాం’’ అని ఆయన వారితో అన్నారు. ప్రత్యేక హోదాతోపాటు మరి కొన్ని ముఖ్యమైన హామీలు కూడా అమలు కావాల్సి ఉందని, వాటన్నింటిని సాధించుకోవాల్సి ఉందని ఆయన చె ప్పారు. ‘ప్రత్యేక హాదా, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాల ఆర్ధికాభివృద్ధికి సాయం, రైల్వే జోన్ మనకు కావాలి. వీటిని ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వీటి సాధనకు మన కృషి కొనసాగుతుంది. ఇవన్నీ వస్తేనే మనం కొంతవరకైనా నిలదొక్కుకోగలగుతాం. ఏం కావాలో మనకు స్పష్టత ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీకి ఏం నైతిక హక్కు ఉందని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో ఒక ప్రకటన చేయడం తప్ప దానిపై కనీసం మంత్రివర్గంలో ఒక తీర్మానం చేశారా అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.
0 comments:
Post a Comment