మన తెలుగు పరిశ్రమ లో అందరి హీరోలు కలిసి మెలిసి ఉంటారు అన్నది నిజం. సినిమాలు వచ్చినపుడు రికార్డులు కొట్టాలని పోటి ఉంటుంది కాని , పర్సనల్ గా అందరు కలుగోలుపుగానే ఉంటారు. ఒకరి ఫంక్షన్లకు ఒకరు వెళ్ళడం , ఆడియో వేడుకలకి వెళ్ళడం , సినిమా ప్రారంభాలకు వెళ్ళడం ఇవన్ని మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు తాజాగా మెగా కాంపౌండ్ హీరో , మహేష్ బాబు ని పొగడటం చర్చనియంశం అయింది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఈ మద్యనే , శ్రీమంతుడు సినిమా చూసాడు. మహేష్ బాబు నటన కి ఫ్లాట్ అయిపోయాడు అల్లు శిరీష్. మహేష్ ఒక సూపర్ స్టార్ అయినప్పటికీ తన పాత్రను చాల అద్భుతంగా అండర్ ప్లే ఆక్ట్ లో చేసాడు అని కొనియాడాడు అల్లు శిరీష్. కొరటాల శివ ఇలాంటి సబ్జెక్టు ని మహేష్ బాబు మీద ప్రయోగించి పెద్ద సాహసమే అని అల్లు శిరీష్ అన్నాడు. మొత్తానికి మెగా ఫ్యామిలి హీరో మహేష్ ని పొగడటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏది ఏమయినా , తన ఆబిప్రయాన్ని ఓపెన్ చెప్పాడు అల్లు శిరీష్.
0 comments:
Post a Comment