విదేశీ, రక్షణ సహ ఆరు ప్రధాన శాఖలకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కీలక సమాచారాన్ని పాక్ నిఘా వర్గాలు హ్యాక్ చేసే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నతాధికారులను బురిడీకొట్టించి దేశ రక్షణకు సంబంధించిన ఆర్మీ, పారామిలటరీ రహస్య సమాచారాన్ని కొల్లగొట్టే యోచనలో పాక్ నిఘా వర్గాలున్నట్లు హోంశాఖ హెచ్చరించింది. అయితే వారి ట్రిక్కులు పని చేయవని భారత రక్షణ వర్గాలు చెబుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి. బుధవారం ఉదంపూర్‌లో బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో ఇద్దరు జవాన్లు చనిపోయారు. ప్రతికాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతిచెందగా మరో ఉగ్రవాది నవీద్‌ను స్థానికులు పట్టుకుని సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. భారత్, పాక్ జాతీయ రక్షణ సలహాదారుల సమావేశానికి ముందుగా జరుగుతున్న ఇలాంటి పరిణామాలతో పాక్ నిఘా వర్గాల కుటిల యత్నాలపై ప్రధాన శాఖలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.
0 comments:
Post a Comment