
ఢిల్లీలో ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఫ్లాట్ కొనే ఉద్దేశంతో వివరాలు కనుక్కునేందుకు బాద్లీ ప్రాంతంలోని ఓ ప్రాపర్టీ డీలర్ కార్యాలయానికి ఆమె వెళ్లారు. అంతకు ముందే అక్కడ మరో ఇద్దరు పురుషులున్నారు. తాగేందుకు ఆమెకు కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. అది తాగాక ఆమె స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహ వచ్చాక ఆమెకు అసలు విషయం తెలిసింది. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి తనకు స్పృహ కోల్పోయేలా చేసి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె గ్రహించారు. షాక్‌కు గురైన ఆమె కేకలు పెడుతూ ప్రాపర్టీ కార్యాలయం నుంచి బయటకు పరిగెత్తారు. ఆమె కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆసుపత్రికి చేర్పించాక ఆమె అత్యాచారానికి గురైందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.
0 comments:
Post a Comment