Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Bankers to Agri gold propeties

    దక్షిణాది రాష్ర్టాలతోపాటు మహారాష్ట్రలోనూ లక్షలాది మదుపరులను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల ఈ-వేలానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇందులో పాల్గొనేందుకు 9 కంపెనీలు ముందుకొచ్చినట్టు సమాచారం. దీనిద్వారా లభించే సొమ్ములో డిపాజిటర్లకు చెల్లించాల్సింది పోగా.. ఏమైనా మిగిలితే యాజమాన్యానికి ఇవ్వనున్నారు.
    ఈ ప్రక్రియలో భాగంగా ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాల జారీకి ఆర్థికశాఖ అనుమతివ్వనుంది. ఆస్తుల తనఖాపై రుణాలిచ్చిన బ్యాంకులు.. రుణగ్రహీతల నుంచి సొమ్ము రాబట్టేందుకు అనుసరించే ఈ ప్రక్రియను పాటిస్తే ఆరోపణలకు తావుండదని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆయా సంస్థల ఆర్థిక సామర్థ్యం, పనితీరు ప్రాతిపదికన బిడ్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ-వేలం నిబంధనలు రూపొందించాక ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Bankers to Agri gold propeties Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top