Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Balayya for Kick 2 Platinum Disk


    చాలా రోజుల కిందటే షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ్ నయా మూవీ కిక్ 2ను ఈ నెల 21న ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తామని అనౌన్స్ చేశాడు చిత్ర నిర్మాత అయిన హీరో కళ్యాణ్ రామ్. దీంతో... ఈ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైనట్టే అని... 40 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా కీలకం కానున్నాయని సినీ జనం అంటున్నారు. సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచే ప్రమోషన్ జోరును పెంచాలని భావిస్తున్న నిర్మాత కళ్యాణ్ రామ్... ముందుగా ఈ మూవీ ప్లాటినమ్ డిస్క్ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని డిసైడయ్యాడట. అందుకోసం ఎవరూ ఊహించని విధంగా... ఈ ఈవెంట్ కు హీరో బాలకృష్ణ ను ఇన్వైట్ చేశాడట కళ్యాణ్ రామ్.


    కళ్యాణ్ రామ్ భావిస్తున్నట్టుగా సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుకకు బాలకృష్ణ వస్తే.. సినిమాకు మంచి హైప్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి నందమూరి హీరోలు ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుకకు వస్తే... సినిమాపై ఆటోమెటిక్ గానే ఆడియెన్స్ లో ఆసక్తి పెరుగుతుందని ప్రచారం జరుగుతోంది. కిక్ 2 గురించి బాలకృష్ణ పాజిటివ్ గా మాట్లాడితే... ఆ ప్రభావం సినిమా విజయంపై కచ్చితంగా ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే... నందమూరి సీనియర్ హీరో నిజంగానే కిక్ 2 ప్లాటినమ్ డిస్క్ ఈవెంట్ కు వస్తారా అనే విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి... కిక్ 2 ప్లాటినమ్ ఫంక్షన్ కు లయన్ వస్తాడా లేదా అన్నది తెలియాలంటే 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Balayya for Kick 2 Platinum Disk Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top