స్వతహాగా తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే
బాబా సెహగల్... పవర్ స్టార్ బర్త్ డే కు ఇప్పటి నుంచే గిఫ్ట్ సిద్ధం చేసే
పనిలో పడ్డాడు. సెప్టెంబర్-2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. పవన్
కు బహుమతిగా ఓ పాటను అందించబోతున్నాడట సెహగల్. సో... 'ఎ పవర్ సాంగ్' పేరుతో
రిలీజ్ కానున్న ఈ స్పెషల్ పాట .. పవన్ బర్త్ డే సందర్భంగా బాబా సైగల్
ఇచ్చే మ్యూజికల్ గిఫ్ట్ అన్నమాట. ఇక ఓ వైపు సింగర్ గా కొనసాగుతూనే..
నటుడిగానూ అదృష్టం పరీక్షించుకుంటున్న సెహగల్.. రీసెంట్ గా రుద్రమదేవి
చిత్రంలో నటించాడు. సెప్టెంబర్-4న రుద్రమదేవి విడుదలవుతుండగా.. సెప్టెంబర్
-2న పవన్ పుట్టినరోజుకు ఈ స్పెషల్ సాంగ్ రిలీజవుతోంది. మొత్తానికి...
సెప్టెంబర్ తొలివారంలో ఓ వైపు పాట.. మరోవైపు నటనతో మెప్పించేందుకు
సిద్ధమయ్యాడు బాబా సెహగల్. మరి.. ఈ రెంటిలో ఈ క్రేజీ సింగర్ కు ఏది ఎక్కువ
పేరు తెచ్చిపెడుతుందో చూడాలి..!
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment