ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇంకా వసూళ్ల వర్షం మాత్రం ఆగలేదు. చాలా తక్కువ టైంలోనే రూ.500 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన బాహుబలి తాజాగా బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ నటించిన ధూమ్ 3 సినిమా రికార్డులను క్రాస్ చేసిది.
‘ధూమ్ 3′ సినిమా ఓవరాల్ గా 542 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ అత్యధిక గ్రాసర్స్ లో 3వ స్థానంలో ఉంది. బాహుబలి రూ. 545 కోట్లు వసూలు చేసి ధూమ్ 3ని నాలుగో ప్లేస్‌లోకి నెట్టేసింది. అమీర్‌ఖాన్ పీకే రూ.700 కోట్ల గ్రాస్ సాధించి ఫస్ట్ ప్లేసులో ఉంటే …సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్‌జాన్ రూ.565 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
తాజాగా బాహుబలి ఇండియన్ సినిమాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో మూడో ప్లేస్‌కు చేరుకుని తెలుగు వాడి స్థాయిని చాటి చెప్పింది. తాజాగా బాహుబలిని ఇప్పుడు అంతర్జాతీయ భాషల్లో కూడా అనువదిస్తున్నారు. అక్కడ కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తే బాహుబలి మరిన్ని రికార్డులు సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
0 comments:
Post a Comment