దేశ రాజధాని ఢిల్లీ నగరంలోకి తొమ్మిది మంది ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే దాడులు జరగవచ్చనని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్రం దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.
స్వాతంత్య్ర దినోత్సవం దగ్గర పడుతుండటంతో భారత రాజధాని ఢిల్లీలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్రపన్నినట్లు సమాచారం. ఢిల్లీలో ఇప్పటికే తొమ్మిది మంది ఉగ్రవాదులు ప్రవేశించారని, వారు పేలుళ్లకు పాల్పడవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల వద్ద ఆర్డిఎక్స్ సహా పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని తెలిపాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.
భారత్-పాక్ మధ్య సంబంధాలను చెడగొట్టేందుకు లష్కరేతోయిబా, హిజ్‌బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ సహా పలు నగరాలపై ఉగ్రవాదులు దృష్టిపెట్టారు. దీంతో సరిహద్దుల్లో సైనిక దళాల పహారా పెంచారు. గురుదాస్‌పూర్, కాశ్మీర్ ఘటన తర్వాత సరిహద్దుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.
0 comments:
Post a Comment