రైతాంగం
అప్పుల్లో మునిగిపోయిందని...వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే జిల్లాలో రాహుల్ పర్యటిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ నటుడు
చిరంజీవి అన్నారు. రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఓబులదేవరచెరువు వద్ద నిర్వహించిన బహిరంగ
సభలో ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య
చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక
సాయం అందించి మున్ముందు మంచి రోజులు వస్తాయని
రాహుల్ హామీ ఇచ్చారన్నారు.
కాంగ్రెస్
హయాంలో రైతాంగం ఎంతో సుఖమయంగా ఉందన్నారు.
నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాల ప్రకారం గత సంవత్సరకాలంలో రైతుల
ఆత్మహత్యలు 35 శాతం పెరిగాయన్నారు. రైతు
రుణమాఫీని రూ.80 వేల కోట్ల
నుంచి రూ.7వేల కోట్లకు
కుదించి తూతూ మంత్రంగా రుణమాఫీ
చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. విమర్శించారు. రైతు రుణమాఫీ ఎవరికీ
అందలేదన్నారు. రైతులకు వెనెముక్కగా నిలిచేది కాంగ్రెస్సే అని చిరంజీవి స్పష్టం
చేశారు.
0 comments:
Post a Comment