
రాజకీయ
నాయకులు, పాఠ్యపుస్తకాల రూపకర్తలు ఒకరినిమించి ఒకరు తమ అజ్ఞానాన్ని
ప్రదర్శించుకుంటున్నారు.
రెండ్రోజుల క్రితం జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్.. బతికున్న
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు
పుష్పాంజలి ఘటించారు. ఈ వార్త సామాజిక
మాధ్యమంలో తీవ్ర చర్చకు దారితీసింది.
గురువారం స్వాతంత్య్ర సమరయోధుడు ఆజాద్ చంద్రశేఖర్ జయంతి. ఈ సందర్భంగా కేంద్ర
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్
తన ఫేస్బుక్ పేజీపై
శ్రద్ధాంజలి ఘటించారు. అయితే.. ఆజాద్ బదులు భగత్ సింగ్
ఫొటో పెట్టి విమర్శల పాలయ్యారు. ఇక ఎన్సీఈఆర్టీ నిబంధనల
మేరకు రూపొందే పాఠ్యపుస్తకాల్లో ఇంతకన్నా ఘోరమైన తప్పు బయటపడింది. భారత్-పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధానికి
కారణమైన పాక్ మాజీ అధ్యక్షుడు
ముషర్రఫ్ గొప్ప నాయకుడంటూ పాఠ్యపుస్తకాల్లో
ప్రచురితమవటంతో.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో స్థానిక బార్
అసోసియేషన్ కలెక్టర్కు ఫిర్యాదుచేసింది.












0 comments:
Post a Comment