- 10 నెలల్లోనే పడిపోయిన ధరలు
- సీఎం చంద్రబాబు ‘విద్యుత్ పొదుపు’ ఫలితం
- రూ.300 నుంచి రూ.72కు తగ్గిన బల్బు ధర
- దేశవ్యాప్తంగా ప్రభావితం చేసిన ఆంధ్రప్రదేశ్
- వివరాలు వెల్లడించిన విద్యుత్ పొదుపు సీఈవో
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ప్రతిష్ఠాత్మక పథకాల్లో విద్యుత్ పొదుపు, సంరక్షణ ఒకటి. అందులో భాగంగా
రాష్ట్రంలోని రెండు కోట్ల మందికి
రూ.10కే ఎల్ఈడీ
బల్బులను పంపిణీ చేస్తుండడంతో వాటి ధర నేలకు
దిగి వచ్చింది. ఒక్క ఏపీలోనే కాదు..
దేశ వ్యాప్తంగా ధరలు తగ్గాయి. ఈ
పథకం చేపట్టిన మొదట్లో 7 వాట్ల బల్బు ధర
రూ.320గా ఉండేది. రెండో
దశ నాటికి రూ.204కే సరఫరా
చేసేందుకు సంస్థలు ముందుకు వచ్చాయి. అది మొదలు పది
నెలలు తిరగకుండానే.. 9 వాట్ల బల్బులను రూ.72.40కే సరఫరా చేసేందుకు
వచ్చాయి. బుధవారం విద్యుత్ పొదుపు కార్యక్రమం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి
దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బుల
ధరలు తగ్గడం పట్ల కేంద్రం సంతృప్తి
వ్యక్తం చేసింది. నిరంతర, సుస్థిర పొదుపు విధానాలను ఆంధ్రప్రదేశ్ పాటిస్తుండడం వల్ల ఎల్ఈడీ
ధరలు అమాంతం తగ్గాయుని కేంద్రుపభుత్వ రంగ సంస్థ ఎనర్జీ
ఎఫిిషయెున్సీ సర్వీస్టెడ్ (ఈఈఎ్సఎల్) ఎండీ
సౌరభ్కుమా వ్యాఖ్యానించారు’’ అని
ఆయున పే్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్ఈడీ బల్బుల ధరలు
300 శాతం మేుర తగ్గాయుని చెప్పారు.
దేశంలో ఏీప ఇందన సాముర్థ్య
రాష్ట్రంగా ఖ్యాతి గాంచిందని సౌరభ్ పేర్కొన్నారు. రాష్ట్రంల ఇందన పొదుపు చర్యలు
విస్తృతంగా అవులు చేసేందుకు వీలుగా
స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని
ఇందనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు.
రాజమండ్రిలో ఉన్న ఆయున ఇందన
పొదుపు విధనాలపై అధిారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో 50 లక్షల ఎల్ఈడీ
బల్బులను పంపిణీ చేశామని, మిగిలిన 9 జిల్లాల్లోనూ కోటిన్నర బల్బులను త్వరిత గతిన పంపిణీ చేయాలని
సీఎం ఆదేశించినట్లు అజయ్‌జైన్ చెప్పారు.
రాష్ట్రంలో 4.5 లక్షల ఎల్ఈడీ
వీధి దీపాలను మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అమర్చే కార్యక్రమం
యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా
9 వాట్ల ఎల్ఈడీ బల్బును
కేవలం 72.40 రూపాయలకే అందించేందుకు ప్రముఖ ఉత్పత్తి సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు. పొదుపు విధానాల్లో ముందంజలో ఉన్నామని రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఇంధన శాఖ అధికారులతో
పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ
ముందంజలో ఉండడంతో .. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ
(బీఈఈ) , ఈఈఎస్ఎల్లు
విశాఖలో అంతర్జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తామని పేర్కొన్నాయని చెప్పారు.
0 comments:
Post a Comment