ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు కొత్త కష్టాలు
వచ్చి పడ్డాయి.
ఆయన మంత్రులెవ్వరూ
ఇంగ్లీష్లో అంత ప్రావీణ్యం
ఉన్న వారు కాకపోవడంతో వారు జాతీయ
మీడియా అడిగే ప్రశ్నలకు నానా
ఇబ్బందులు పడుతున్నారు. ఇతర పార్టీల నేతలు, నాయకులు
జాతీయ మీడియాలో ఇంగ్లిష్ లో మాట్లాడుతూ దూసుకుపోతుంటే..
సొంత పార్టీ మంత్రులు.. ఇతర నేతలు వచ్చిరాని
ఇంగ్లిష్ మాట్లాడుతూ చంద్రబాబుకు కొత్త కష్టాలు తీసుకువస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు
కానీ..ప్రభుత్వం తరపున జరిగిన లోటుపాట్లను
సమర్థవంతంగా
తిప్పికొట్టడంలో కానీ ఏపీ
ప్రభుత్వం జాతీయ మీడియాలో అంతగా ప్రభావితం
చూపలేకపోతోంది. ఇటీవల పుష్కరాల
తొక్కిసలాట జరిగి
30 మంది చనిపోతే ఓ
ఇంగ్లిష్ చానెల్ అడిగిన ప్రశ్నలకు ఏపీ మంత్రులు పల్లె
రఘునాథ్ రెడ్డి, పి.నారాయణలు ఇంగ్లీష్లో సమాధానం
చెప్పేందుకు నానా తికమక పడ్డారు.
నారాయణ ఏదోలా గట్టెక్కినా పల్లె మాత్రం
పూర్తిగా ఫెయిల్ అయ్యారు.
కనీసం ఎక్కువ మంది
రావడం వల్లే
ఇలా జరిగిందని
కూడా వారు చెప్పలేకపోయారు. అలాగే కొద్ది రోజుల
క్రితం రాజ్యసభ
సభ్యుడు సీఎం రమేష్
కూడా జాతీయస్థాయిలో ఇంగ్లీష్
ఛానెల్స్తో మాట్లాడేందుకు తీవ్ర
ఇబ్బందులు పడ్డాడు. దీంతో
ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాల వివరాలను ఇంగ్లిష్ చానెల్స్ లో చెప్పడానికి ఎంపీ
గల్ల జయదేవ్ కి ఒక్కడికి మాత్రమే
చంద్రబాబు అనుమతి ఇచ్చారట.
జయదేవ్ అయితే
ఇంగ్లీష్ అనర్గళంగా
మాట్లాడతారు.సమర్థవంతం గా
ఇంగ్లీష్ మాట్లాడేవారిని గుర్తించే వరకు ఇంగ్లీష్ చానెల్స్
తో ఎవరూ మాట్లాడకూడదని చంద్రబాబు
హుకుం జారి చేశారట.
ఏదేమైనా జయదేవ్‌కు చంద్రబాబు
వద్ద మంచి లక్కీ ఛాన్స్ దొరికినట్లయ్యింది.
0 comments:
Post a Comment